విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం క్యూ క‌ట్టిన ద‌ర్శ‌కులు..

277
vijay
- Advertisement -

వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్నాడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటివ‌లే వ‌చ్చిన ట్యాక్యీవాలా చిత్రంతో మ‌రోక హీట్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. గీత గోవిందం, ట్యాక్సివాలా వ‌రుస హీట్ల‌తో బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాడు. తాజాగా ఆయ‌న మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్లో డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈమూవీని కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తుండ‌గా..ర‌ష్మీక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈమూవీ త‌ర్వాత ఆల్రేడి రెండు ప్రాజెక్టులకు అత‌ను సైన్ చేశాడు.

arjun reddy

అవి కాకుండా ఇంకో నాలుగు సినిమాల అడ్వాన్సులు కూడా ఆయ‌న తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇంకో రెండు సంవత్స‌రాల వ‌ర‌కూ విజ‌య్ డేట్లు ఖాళీగా లేవ‌ని చెప్పుకోవాలి. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం మ‌రో ముగ్గురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్ప‌టికే విజ‌య్ కి క‌థ చెప్పిన‌ట్టుగా స‌మ‌చారం. క‌థ న‌చ్చ‌డంతో విజ‌య్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్.

puri vijay

మ‌రో ద‌ర్శ‌కుడు మారుతి కూడా విజయ్ కోసం రెండు మూడు క‌థ‌ల‌ను సిద్దం చేసుకున్నాడ‌ట‌. గోపీచంద్ మలినేని కూడా ఒక కథపై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఆ కథను త్వరలోనే విజయ్ దేవరకొండకి వినిపించనున్నాడని అంటున్నారు. ఇంకో రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ విజ‌య్ డేట్లు ఖాళీగా లేక‌పోవ‌డంతో అయినా స‌రే విజ‌య్ కోసం వెయిట్ చేస్తున్నారు ద‌ర్శ‌కులు.

- Advertisement -