మ‌హేశ్ బాబును ఫాలో అవుతోన్న‌ బ‌న్నీ..

220
bunney mahesh
- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సినిమా రంగంతో పాటు ఇటివ‌లే వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ను ప్రారంభించారు మ‌హేశ్ బాబు. ఇన్నాళ్లు సినిమాపైనే దృష్టి పెట్టిన మ‌హేశ్ బాబు ఇప్పుడు వ్యాపార రంగంలో త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోబుతున్నాడు. ఇప్పుడు మరి కొంత మంది తారలు ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు వ్యాపారాల్లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కూడా మల్టీప్లేక్స్ థియేట‌ర్స్ ను నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నారని తెలుస్తుంది.

amb

బీడ‌బ్స్ పేరుతో ప‌బ్ ల‌ను నిర్వ‌హిస్తున్నాడు బ‌న్నీ. మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు బన్నీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అమీర్ పేట లో ఉన్న సత్యం థియేటర్ స్థానంలో మల్టిప్లెక్స్ కట్టేందుకు బన్నీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.అలాగే బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ లోనూ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు స‌మాచారం. మ‌రికొద్ది రోజుల్లో త్రివిక్ర‌మ్ బ‌న్నీ కాంబినేష‌న్ లో సినిమా రాబోతుంద‌ని సమాచారం.

- Advertisement -