మొక్కలు నాటిన యువదర్శకుడు వెంకీ అట్లూరి

420
Venky

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఈరోజు సాయంత్రం సురారం లోని టెక్ మహేంద్ర క్యాంపస్ లో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వాతావరణ కాలుష్యాం నియంత్రణ కావాలి అంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు కాదంబరి కిరణ్ ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ,ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.