టాలీవుడ్ దర్శకుడితో అనసూయ రొమాన్స్..!

222
- Advertisement -

టాలీవుడ్లో ‘పెళ్లిచూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడి కోసం నిర్మాత అవతారం ఎత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం చేశారు.

Anasuya

ఈ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండతో పాటు తరుణ్ భాస్కర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన డైరెక్టర్ రుణం తీర్చుకోవాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయం ఏంటంటే.. హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం నాలుగు క్యారెక్టర్ల మధ్య కొనసాగుతుంది. తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్‌ను ఈ చిత్రంలో హీరోగా విజయ్ పరిచయం చేయబోతున్నాడు. తరుణ్‌కు జోడీగా అనసూయ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ విజయ్‌కి చెప్పడంతో… ఆయన కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -