టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తునే నిర్మాతగా మారి కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రంగస్ధలం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈమూవీ తర్వాత సుకుమార్ మరే సినిమాను చేయలేదు. మహేశ్
బాబుతో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుకుమార్ చెప్పిన స్టోరీకి మహేశ్ కు అంతగా నచ్చలేదని సమాచారం.
అందుకే మహేశ్ సుకుమార్ ను హోల్డ్ లో పెట్టారని ఫిలీం నగర్ వర్గాల సమాచారం. సుకుమార్ గురించి టాలీవుడ్ వర్గాల్లో మరో వార్త వైరల్ గా మారింది. దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ పై దృష్టి పెట్టాడనే ప్రచారం జరగుతుంది. సుకుమార్ హిందీలో సినిమాలు చేయడానికి సిద్దమైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్ లో సినిమా చేయడానికి సుకుమార్
ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడట.
ఈసందర్భంగా త్వరలోనే ఆయన బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లను కలవనున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల్లోని హైలెట్స్ సీన్స్ తో ఒక షో రీల్ ను సిద్దం చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ షో రీల్ ను బాలీవుడ్ హీరోలకు చూపించి అవకాశాలను దక్కించుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈవిషయంలో నిజనిజాలు
తెలియాలంటే దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇవ్వాల్సిందే.