మహారాష్ట్ర రాజకీయాలపై దర్శకుడు హరీశ్ శంకర్ కామెంట్

512
Harish Shankar
- Advertisement -

మహారాష్ట్రలో రోజురోజుకి రాజకీయాలు వేడుక్కుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించగా..ఉదయం అజిత్ పవార్ తో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఫడ్నవిస్. కాగా శివసేన, శరద్ పవార్ కు ఏం చేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజకీయాలపై స్పందించారు టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్.

శరద్ పవార్ 1978లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారని, ఆ మరుసటి రోజే పార్టీని చీల్చి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని వెల్లడించారు. ఇప్పుడు అజిత్ పవార్ రూపంలో అదే అనుభవం ఆయనకు ఎదురైందని, అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు తెలుస్తోందని హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tollywood Director Harish Shankar Respond On Maharsta Politics

- Advertisement -