కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసనలు

7
- Advertisement -

సినీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణ నగర్, జవహర్ నగర్ కార్యాలయం వద్ద మళ్లీ 24 క్రాఫ్ట్స్ కార్మికుల నిరసన చేపట్టారు. అన్నపూర్ణ శివనేకర్ రహదారిని దిగ్భంధం చేసి నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టారు కార్మికులు.

ఈ నైపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… చిరంజీవితో మూడు గంటలకు సమావేశం అవుతాం.. ఛాంబర్ నుండి నాలుగు గంటలకు సమావేశానికి రమన్నారు అన్నారు. మా నిర్ణయాలు వారికి తెలియజేస్తాం.. మేము ఐక్యంగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం అన్నారు.

మా డబ్బులు మాకు ఇవ్వండి.. 13 కోట్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి…మా కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించండి అని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఫైటర్స్, డాన్సర్ రేషియో విషయంలో స్థానికులు లేకపోతే ఇతర రాష్ట్రాల వారిని తీసుకోవాలని అంగీకరించాము… నిర్మాతలకు ఇష్టమైన స్కిల్ వారిని నియమించుకోవచ్చు.. ఇందుకుమేము ఒప్పుకున్నాము అన్నారు.

తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం… ఆదివారం డబుల్ పెమెంట్ ఇవ్వము అంటున్నారు, కానీ కుటుంబాన్ని వదిలి కొంత ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో పనిచేస్తాం.. అయినా ఆ నిబంధనకు మేము కొంతవరకు ఒప్పుకున్నాము అని ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ చెప్పారు.

Also Read:జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్ ధ్వంసం!

- Advertisement -