ఇందిరాదేవికి ప్రముఖుల సంతాపం

85
- Advertisement -

సూపర్‌స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి అనారోగ్యంతో ఇవాళ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

ఇందిరాదేవి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ,ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ,నందమూరి బాలకృష్ణ ,మెగాస్టార్ చిరంజీవి తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇందిరాదేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని …వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ బాధ నుంచి కృష్ణ, మహేష్‌ బాబు త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

- Advertisement -