అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో మాట్లాడిన ఆయన…ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా అన్నారు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని.. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు నటుడు నాగార్జున. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి.
ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందని నిర్మాత మురళీ మోహన్ చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని…సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు.
ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు దగ్గుబాటి సురేష్‌బాబు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని…ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో.. చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందన్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు..హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలన్నారు.
మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని చెప్పగా ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. ఈరోజు తెలుగు సినిమా నిర్మాతలకు శుభదినం అన్నారు అల్లు అరవింద్.
Also Read:నవ సత్యాగ్రహ బైఠక్‌కి సీఎం రేవంత్ రెడ్డి