తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. లైంగిక వేధింపులపై పోరాడుతా అంటూ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి… వ్యక్తిగత దూషణలు చేసి ఆమె మొదలు పెట్టిన ఉద్యమం మధ్యలోనే ఆగేలా చేసింది .వ్యక్తి దూషనల వల్ల పవన్ ఫ్యాన్స్ కి, ఆమెకి సోషల్ మీడియాలో విబేధాలు తలెత్తాయి. మరోవైపు ఇప్పటి నుంచి తాను పెట్టే పోస్టులకు పవన్ కల్యాణ్ కి సంబంధం లేదని నటి శ్రీరెడ్డి స్పష్టం చేసింది, వాటిని అనవసరంగా పవన్ అభిమానులు ట్రోల్ చేయరాదని కూడా ఆమె ఈ మధ్య తెలియజేశారు.
తాజాగా తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో తనను అసభ్యంగా కామెంట్లు, వీడియోనిలు పెట్టిన వారందరిని కోర్టు లాగుతానని హెచ్చరించింది. లాయర్ గోపాలకృష్ణకళానిదితో కలిసి మీడియాతో మాట్లాడారు శ్రీరెడ్డి. లాయర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఓ మహిళ అనే ఆలోచన లేకుండా శ్రీరెడ్డిపై అసభ్య వీడియోలు, కామెంట్లు కొందరు సోషల్ మీడియాలు పెట్టారని, వారందరినీ కోర్టుకు లాగుతామని లాయర్ తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా ఆమెను బెదిరించిన, దూషించిన వారందరిపై కేసులు పెట్టబోతున్నామని తెలిపారు. ఈ కేసులో మా అసోషియేషన్, జూనియర్ ఆర్టిస్టులు, పవన్ అభిమానులు ఇలా కామెంట్ చేసిన వారందరిపై కేసులు పెడతామని క్రిమినల్, సైబర్, యాక్ట్ కింద అభియోగాలు నమోదుచేస్తామని లాయర్ తెలిపారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేస్తామని కూడా తెలిపారు.