సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ

284
Akhilesh meets CM KCR
- Advertisement -

దేశంలో గుణాత్మక మార్పే లక్ష్యంగా మరో ముందడుగు పడింది. సీఎం కేసీఆర్‌తో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. అఖిలేష్ కు ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం దేశ రాజకీయ పరిస్ధితులు,థర్డ్ ఫ్రంట్ ఆవష్యకతపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.

అంతకుముందు లఖ్‌నవూ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్‌కు మంత్రులు కేటీఆర్‌, తలసాని ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్‌ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశాయి.

Image result for cm kcr akhilesh

గుణాత్మక మార్పు అవసరమని పేర్కొన్న కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు. రానున్న

- Advertisement -