తల్లి కాబోతున్న హీరోయిన్

1662
- Advertisement -

నటి పూర్ణ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలో తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. యూట్యూబ్‌లో తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నెటిజన్లు పూర్ణ, ఆమె భర్త షనీద్‌లకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో వీరి వివాహం జరిగింది. షనీద్ ఆసిఫ్ అలీ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగువారికి పరిచయమైన మలయాళీ పూర్ణ, ఆ తర్వాత ‘సీమ టపాకాయ్‌’, ‘అవును’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు, అల్లుడు కంచు’ అవును2 వంటి చిత్రాల్లో నటించింది.

చివరిగా బాలకృష్ణ నటించిన ‘అఖండ’లో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం నటిగానే కాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి…

దళపతి 67లో కొత్త విలన్‌..?

బాలయ్య.. ఫుల్ అనిల్ స్టయిల్ లోకి

ప్రభాస్ ఫ్యాన్స్‌ కు డబుల్ కిక్ !

- Advertisement -