మొక్కలు నాటిన నటీ హిమజ

304
himaja
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటుతున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివజ్యోతి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు నటీ హిమజ. ఈసందర్భంగా జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా నటీ హిమజ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఎంపీ సంతోష్ కుమార్ ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టమని నేను సమయం దొరికినప్పుడల్లా మొక్కలు నాటుతానని తెలిపింది. ఈరోజు నేను ఇక్కడ మూడు మొక్కలు నాటడం జరిగింది అని నాటిన మొక్కల కు మూడు పేర్లు పెట్టుకుంటున్నాను రాముడు, సీత,లక్ష్మణుడు వీరు ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటారు కాబట్టి ఈ మొక్కలు కూడా అదే విధంగా కలిసి పెరగాలని కోరుకుంటూన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురిని నందిత రాయి,ప్రణవి మానుకొండ, భాను లను మొక్కలు నాటాలని కోరుతున్నట్లు తెలిపారు.

- Advertisement -