సీఎం కేసీఆర్‌ నిర్ణయం… విప్లవాత్మకం

64
tollywood actors adds more color to Telugu Mahasabalu

తెలుగును భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు మహాసభలను ఇంత ఘనంగా నిర్వహించినందుకు సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో భాగంగా  సినీ సంగీత విభావ‌రిలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలిపారు. కన్నులపండువగా సాగుతున్న తెలుగు మహాసభల్లో పాల్గొనందుకు ఆనందంగా ఉందన్నారు. తెలుగు వాళ్లు తెలుగులోనే మాట్లాడుకోవాలని చిరంజీవి సూచించారు.

తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు మోహన్ బాబు. సీఎం కేసీఆర్ గొప్ప పోరాట యోధుడు అని..ఆయన గురించి ఎక్కువ చెప్పుకున్నా తక్కువేనని తెలిపారు. మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని కొనియాడారు. లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన కేటీఆర్‌ను మోహన్‌ బాబును ఘనంగా సన్మానించారు.

tollywood actors adds more color to Telugu Mahasabalu
తెలంగాణ వారికి అభిమానించడం తెలుసు..ఎదురించడం తెలుసని నందమూరి బాలకృష్ణ అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసిన  బాలకృష్ణ సభికులను అలరించారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా మాత్రమే విడిపోయామని మనుషులుగా కాదన్నారు. మన భాష తెలుగు భాష అని..మాతృభాష తల్లిపాల లాంటిదన్నారు. తెలంగాణ మాగాణం తెలుగు భాష అన్నారు. దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని కొనియాడారు సీనియర్ నటుడు కృష్ణ.

ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహ‌రి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఈటల రాజేంద‌ర్‌, కేటీఆర్ పాల్గొంటున్నారు. అలాగే, సినీ ప్రముఖులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ దేవరకొండ‌, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, అల్లు అర‌వింద్ తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు.