మద్యం మత్తులో హంగామా చేసిన క్రికెటర్

364
praveen-kumar

భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. మద్యం మత్తులో పక్క ఇంటి వారిపై దాడి చేశారని ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదైంది. తనపై,తన కొడుకుపై ప్రవీణ్ కుమార్ దాడి చేశాడని ఆరోపిస్తూ దీపక్ శర్మ అనే అతని పొరుగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన సమయంలో ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా అకారణంగా తనను కొట్టడంతోపాటు తన పిల్లాడిని దూరంగా విసిరేశాడని దీపక్ ఆరోపించాడు. ఈ ఘటనతో తన చేయి విరిగిపోయినట్లు బాధితుడు తెలిపాడు.

ప్రవీణ్ కుమార్ తనపై దాడి చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు స్వీకరించలేదని పేర్కొన్నాడు. క్రికెటర్‌గా అతనికి ఉన్న హోదా వల్లే తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించాడు. అయితే ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నట్లు తెలిపాడు.ఈ విషయంపై ఎస్పి మాట్లాడుతూ.. వారిద్దరూ తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇరుగుపొరుగు అయిన వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రవీణ్ కుమార్ 2018 అక్టోబర్‌లో అన్నిఫార్మాట్లలోనూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.