టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై గత కొద్ది రోజుల క్రితం రచ్చ జరిగిన విషయం తెలిసిందే. నటి శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పై చాలామంది శ్రీరెడ్డికి మద్దతు పలికినా మరికొంత మంది విమర్శించారు. శ్రీరెడ్డి చేసిన విమర్శలపై సరైన ఆధారాలు లేకపోవడంతో ఆమె చేసిన ఉద్యమం నీరుగారిపోయింది. ప్రస్తుతం శ్రీరెడ్డి సోషల్ మీడియాలో నిత్యం ఎవరోఒకరిమీద వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది.
పలువురు డైరెక్టర్లు, ప్రోడ్యూసర్లు కొంత మంది సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి మరో వ్యక్తి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరో, దర్శకుడు, ప్రముఖ డ్యాన్స్ ర్ రాఘవ లారెన్స్ పై నటీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవ లారెన్స్ అసలు రంగు ఇదే అంటూ వ్యాఖ్యలు చేసింది. తన స్నేహితుల ద్వారా ఓ రోజు తాను గోల్కొండ హోటల్ లో కలిసామని శ్రీరెడ్డి తెలిపింది.
లారెన్స్ తనను తీసుకుని హోటల్ రూమ్ కి తీసుకెళ్లాడని..అక్కడ ఆయన రూమ్ లో రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూశానని నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారికి సాయం చేస్తానని తనతో చెప్పాడని తెలిపింది. ఆ తర్వాత నా ప్రక్కన కూర్చోని నా నడుము, బొడ్డు చూపించమన్నాడని..అంతేకాకుండా అద్దం ముందు నిలుచోని డ్యాన్స్ చేయాలని చెప్పాడని తెలిపింది. ఆయన సినిమాలో నాకు అవకాశం ఇప్పిస్తామని ఇంత వరకూ ఇవ్వలేదని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పేర్కొంది.