పసిడి ధర పైపైకి..

447
gold
- Advertisement -

బంగారం ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. వరుసగా ఐదో రోజు కూడా పసిడి ధర పైకి కదిలింది. దీంతో ధర రూ.42 వేలు దాటిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ఏకంగా రూ.400 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,200 నుంచి రూ.49,600కు పెరిగింది.

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.42,230, విజయవాడలో రూ.40,750, విశాఖపట్నంలో రూ.42,010, ప్రొద్దుటూరులో రూ.40,750, చెన్నైలో రూ.40,760గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,660, విజయవాడలో రూ.38,760, విశాఖపట్నంలో రూ.38,760, ప్రొద్దుటూరులో రూ.38,780, చెన్నైలో రూ.38,820గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.49,200, విజయవాడలో రూ.49,600, విశాఖపట్నంలో రూ.49,500, ప్రొద్దుటూరులో రూ.49,300, చెన్నైలో రూ.51,400 వద్ద ముగిసింది.

- Advertisement -