టిమిండియాకు షాక్..నేటి మ్యాచ్ కు కోహ్లి దూరం

554
- Advertisement -

భారత్ తో శ్రీలంక టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. గౌహతిలో ఇవాళ సాయంత్రం 6గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. వెస్టిండిస్ తో సిరీస్ గెలిచిన టీఇండియా అదే జోష్ శ్రీలంకతో కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే శ్రీలంకతో తొలి మ్యాచ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నట్లు తెలుస్తుంది. ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కోహ్లి వేలుకు గాయం తగిలింది.

గాయం కారణంగా కోహ్లి మొదటి మ్యాచ్ ఆడతాడ లేదా అన్నదానిపై సందిగ్దత నెలకొంది. ఒకవేళ కోహ్లి మ్యాచ్ కు దూరం అయితే ఒపెర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక మరోవైపు టింఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విరామం తీసుకున్నాడు. అటు కోహ్లీ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చాలా రోజుల వ్యవధి తర్వాత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు.

- Advertisement -