నరమేధానికి 8 ఏళ్లు..

249
TODAY IS 26/11-
TODAY IS 26/11-
- Advertisement -

ముంబై దాడులకు ఎనిమిదేళ్లయిన సందర్భంగా.. ఆనాటి మృతుల కుటుంబాలు.. అమర వీరులకు నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముంబై ప్రజల ప్రాణాలు కాపాడటానికి తీవ్రవాదులతో దైర్యంగా పోరాడి ప్రాణాలు అర్పించిన పోలీసులకు సెల్యూట్ చెప్పారు. పోలీసులకు అధునాతన ఆయుధాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాక్రే, ముంబై మాజీ పోలీస్ కమిషనర్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లు, విలాసవంతమైన హోటల్స్, మెట్రో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సముద్ర తీర పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముంబైలో ఉగ్రవాదులు విరుచుకుపడి (26/11) 8 ఏళ్లు అవుతుంది. ఉగ్రవాదుల దాడిలో అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అప్పటి నుంచి 26/11 సమీపిస్తుందంటే ముంబైలో స్థానిక ప్రజలు హడలిపోతుంటారు. ముంబైలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు.

BCt_WokCEAIyZrS

నవంబర్ 26, 2008లో లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్మాదంతో ముంబయిపై చేసిన దాడుల్లో 173 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.

in-pictures-26-11-attacks-anniversary

- Advertisement -