చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 21

109
Today in History

డిసెంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 355వ రోజు (లీపు సంవత్సరములో 356వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 10 రోజులు మిగిలినవి.

సంఘటనలు

2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.

జననాలు

1853: వేదము వేంకటరాయ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు, నాటకకర్త. (మ.1929)
1926: అర్జా జనార్ధనరావు, ప్రసిద్ధ తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (మ.2007)
1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015)
1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011)
1932: యు.ఆర్.అనంతమూర్తి, ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014)
1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007)
1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.

మరణాలు

1962: ఉప్మాక నారాయణమూర్తి, ప్రముఖ సాహితీ వేత్త, అవధాని మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది. (జ.1896)
1969: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (జ.1915)
1972: దాసరి కోటిరత్నం, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)