మరింత తగ్గిన బంగారం ధర..

229
Gold Rate Today Live
- Advertisement -

బంగారం ప్రియులకు శుభవార్త…బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టింది. పదేళ్ల గరిష్టానికి చేరిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 30 తగ్గి రూ.46,890కి చేరింది.

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30 తగ్గి రూ.51,170కి చేరింది. బంగారం ధర తగ్గిన వెండి ధర రూ. 50 పెరిగి 52 వేలకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీ నుంచి డిమాండ్ ఉన్న కారణంగా వెండి ధర పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -