ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన విండీస్…తొలిటెస్టులో గెలుపు

193
westindies
- Advertisement -

ఆతిథ్య ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది వెస్టిండీస్. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ విధించిన 199 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కొల్పోయి చేధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది విండీస్.

కరేబియన్ల విజయంలో కీలకపాత్ర పోషించాడు బ్లాక్ వుడ్. ఆరంభంలో వెంటవెంటనే మూడు వికెట్లు కొల్పోయిన విండీస్‌కు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే జట్టును విజయతీరాలకు చేర్చాడు. 95 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రే ఆర్చర్ 3 వికెట్లు, బెన్ స్టోక్స్ 2 వికెట్లు, మార్క్ వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.

ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ – 210
వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్- 318
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ – 313
వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ -200/6

- Advertisement -