- Advertisement -
గత కొద్దిరోజులుగా ఆల్ టైం హైకి పెరిగిన బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రెండ్‌కు తగ్గట్టుగా పసిడి ధరకు బ్రేక్ పడగా వెండి ధర మాత్రం పెరిగిపోతూనే ఉంది.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ.55,320కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ.50,700గా ఉంది.
కేజీ వెండి ధర రూ.900 పెరిగి రూ.68,900గా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.30 శాతం తగ్గి 1992 డాలర్లుగా ఉంది.
- Advertisement -