జిగేల్ మంటున్న బంగారం..

436
gold rate
- Advertisement -

బంగారం ధర జిగేల్ మంటోంది. రోజురోజుకి పెరిగిపోతున్న పసిడి ధరలతో వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.56,810కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.52,080కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.52,550కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.53,750కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.65,050కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరిగడంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -