ధోనికి స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా…

210
pandya dhoni

టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్ ఎం.ఎస్ ధోని నిన్న బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. నిన్న‌టితో ధోని 37వ సంవ‌త్స‌రంలోకి అడ‌గుపెట్టాడు. ఈసంద‌ర్భంగా నిన్న త‌న టీమ్ మెట్స్ తో బ‌ర్త్ డే ను జ‌రుపుకున్నాడు. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ధోని ఆయ‌న భార్య సాక్షి, కూతురు జీవాతో పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. ఈసంద‌ర్భంగా ప‌ల‌వురు క్రికెట‌ర్లు, ధోని అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్షాలు తెలిపారు.

Hardik-Pandya, MS-Dhoni

ఇక టీంఇండియా ప్లేయ‌ర్లు ధోని కి గిఫ్ట్ గా ఓ వీడియోను త‌యారు చేసి గిప్ట్ గా ఇచ్చారు. ఇక అంద‌రిక‌న్న డిఫ‌రెంట్ గా ఆలోచించి ఓ స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చాడు టీంఇండియా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా. ఈప్ర‌త్యేక‌మైన రోజున ధోనికి నేను ఈ ప్ర‌త్యేక‌మైన హెయిర్ క‌ట్ ను గిఫ్ట్ గా ఇస్తున్నాను అంటూ హార్ధిక పాండ్యా త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఈసంద‌ర్భంగా ఆ ఫోటోను చేసిన ధోని అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసింది..ద‌యచేసి ఇంట్లో ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని కామెంట్ కూడా చేశాడు హార్ధిక్ పాండ్యా.