మళ్లీ తగ్గిన బంగారం ధర

374
gold-rate-today
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్‌లో పసిడి దిగిరావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 తగ్గి రూ.53,350కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80 తగ్గి రూ.48,900గా ఉంది.

కేజీ వెండి ధర రూ.80 తగ్గి రూ.67,900కు చేరగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1950 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 26.98 డాలర్లకు చేరింది.

- Advertisement -