నవోదయ స్కూల్స్‌ మంజూరుచేయండి:ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

112
kotha prabhakarreddy

తెలంగాణకు రావాల్సిన నవోదయ పాఠశాల అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.లోక్ సభ జీరో అవర్లో మాట్లాడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి….గత ఆరు సంవత్సరాల నుండి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు.

ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యక్తిగతంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.…ప్రధాని నరేంద్రమోడీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు.తెలంగాణలోని 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు లేవు.…వీలైనంత త్వరగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.మౌలిక సదుపాయాలు, భూమి కేటాయింపులకు సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.