బ్యాంక్ తో ఫైన్ కట్టించుకోండిలా!

24
- Advertisement -

సాధారణంగా బ్యాంక్ లకు మనం ఫైన్లు కడుతుంటాము. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయకపోయినా లేదా తీసుకున్న లోన్ సరైన సమయంలోపు చెల్లించకపోయిన బ్యాంకులు పెనాల్టీ వేస్తూ మన దగ్గర నుంచి మనీ వసూలు చేస్తుంటాయి. మరి బ్యాంకులు తప్పు చేస్తే వాటి నుంచి మనం కూడా ఫైన్ కట్టించుకోవచ్చని తెలుసా ? అవునండి. బ్యాంకులు కూడా రూల్స్ అతిక్రమిస్తే ఆర్బీఐ రూల్స్ ప్రకారం పెనాల్టీ కట్టాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం.!

సాధారణంగా నేటి రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ అందరూ యూస్ చేస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు వాటిని ఉపయోగించి వస్తువులు కొనుకోవడం, ఇతరత్రా అవసరాలకు మనీ వాడుకోవడం చేస్తుంటాము. క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ తీసుకున్న డబ్బు సరైన సమయానికి చెల్లించని పక్షంలో పెనాల్టీల ద్వారా మన నుంచి అధిక ఫైన్ వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. అయితే క్రెడిట్ కార్డ్ పై ఎలాంటి డ్యూస్ లేకుండా మెంటైన్ చేస్తూ, ఇక వద్దు అనుకున్నప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ ను క్లోజ్ చేయాలని భావించినప్పుడు సంబంధిత బ్యాంకును సంప్రదించాలి.

అయితే క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ పోతుందనే భావనతో బ్యాంకులు కొంత ఆలస్యం చేస్తుంటాయి. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని బ్యాంక్ ను ఆశ్రయించిన తరువాత వారం రోజుల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే వారం రోజులు దాటినప్పటికి ఆ బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తే ఆ క్రెడిట్ కార్డ్ వినియోగ దారుడు సంబంధిత బ్యాంక్ పై కేసు వేయవచ్చు. అలా కేసు వేస్తే ఆ బ్యాంకు రోజుకు రూ. 500 చొప్పున నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి పెనాల్టీ రూపంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు తప్పుచేసిన శిక్ష తప్పదని గుర్తించాలి.

Also Read:Jagan:టార్గెట్ లోకేష్..జగన్ ప్లాన్ అదే?

- Advertisement -