ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి!

34
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషి ప్రధానంగా ఎదుర్కొనే సమస్య తీవ్రమైన ఒత్తిడి. చేసే పనిలోనైనా, ఇతరత్రా సమస్యల కారణంగానైనా ఒత్తిడికి లోనౌతూ ఉంటారు. ఇంకొందరిలో ఓ మానసిక ఒత్తిడి సమస్య ఎలా ఉంటుందంటే ఒక ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆఫీస్ లో బాస్ తిట్టినా, చేయాల్సిన పని సరిగా చేయకపోయిన, ఇంట్లో ఏదైనా గొడవ అయిన.. ఇలా ఎన్నో సంధార్భాల్లో తీవ్రమైన ఒత్తిడికి గురై అదే మానసిక రుగ్మతగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. శారీరక సమస్యలను నిరోధించడానికి సరైన మెడిసన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మానసిక సమస్యల బారిన పడితే ఎన్ని మెడిసన్స్ తీసుకున్న ఎలాంటి అనుకూల ఫలితాలు కనిపించవు. కాబట్టి ఎలాంటి మానసిక సమస్యలకైనా ఒత్తిడే ములా కారణం. కాబట్టి ఆ ఒత్తిడిని సింపుల్ గా ఎలా తక్కించుకోవాలో తెలుసుకుందాం.. !

శ్వాసపై నియంత్రణ
ఎప్పుడైనా టెన్షన్ గా అనిపించినప్పుడు ఊపిరిని గట్టిగా తీసుకొని కొన్ని క్షణాలు అలాగే పట్టి ఉంచి ఆ తరువాత నెమ్మదిగా వదిలితే మైండ్ రిలాక్స్ మోడ్ లోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తీడి టెన్షన్ లకు గురైనప్పుడు శ్వాసపై పట్టు పెంచుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు కూడా చెబుతున్నారు. శ్వాసపై నియంత్రణ కోసం ఊపిరి తీసుకుంటూ ఆ తరువాత నెమ్మదిగా వదులుతూ ఇలా వీలైనంతా సేపు చేస్తే మొదడు పని తీరు మెరుగు పడి రీఫ్రెష్ గా మారుతుంది.

Also Read:‘టైగర్ సందేశం’.. సెన్సేషన్

ప్రకృతి అందాలను ఆస్వాదించడం
మానసిక ప్రశాంతతను ఇవ్వడంలో ప్రకృతిని మించిన మెడిసన్ ఏది లేదని నిపుణులు చెబుతుంటారు. మనసు బాధగా ఉన్నప్పుడూ, ఏవేవో ఆలోచనలతో సతమతం అవుతున్నప్పుడు మిమ్మును మీరు కొత్తగా మార్చుకోవడం కోసం ప్రకృతితో మమేకం అవడం ఎంతో ముఖ్యం. ఆహ్లాదకరమైన వాతావరణంలో కనీసం ఒక అరగంట ప్రకృతిలో గడిపిన ఎంతో మానసిక ఆనందాన్ని పొందవచ్చట.

ఫ్యామిలీ, స్నేహితులతో గడపడం
సాధారణంగా మానసిక సమస్యలతో బాధ పడే వారు ఒంటరి జీవితాన్ని గడపడానికే ఎక్కువ ప్రదాన్యం ఇస్తూ ఉంటారు. అలాంటి వారు ఆ దొరణీ నుంచి బయట పడాలంటే, స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడపాలి. వారితో మీకున్న భావాలను పంచుకోవాలి. మనసులో భారంగా అనిపించే ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగానూ, ఆనందంగాను ఉంటుంది.
.
కాబట్టి ఒత్తిడి ఆందోళన, వివిధ రకాల మానసిక సమస్యలతో బాధ పడే వారు పై నియమాలను పాటిస్తే ఎలాంటి మానసిక సమస్యల నుంచైనా బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు..

- Advertisement -