అమ్మ .. ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో…అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. సృష్టికి మూలం అమ్మ. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. అమ్మను మించిన దైవం ఉన్నదా…ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ అమ్మకు ప్రేమగా ఎన్నో పాటలు పాడుకుంటాం.
పురిటినొప్పులను భరించి నవమాసాలు మోసి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. నిన్న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపారు టీరా్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రియమైన అమ్మకు..అద్భుతమైన అమ్మలందరికీ అంతులేని ప్రేమతో, నిరంతరం అండగా నిలుస్తూ, ఈ స్థాయిలో మేం ఉండటానికి మీరు చేసిన సేవలకు అసంఖ్యాక కృతజ్ఞతలు అని ఆదివారం ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా తన తల్లి, తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోతో పాటు ..ఇటివలే తన పుట్టినరోజు నాడు మొక్కలు నాటిన ఫొటోను షేర్ చేశారు కేటీఆర్.
To my lovely Amma and all the wonderful mothers out there, zillions of thanks for all that you do to make us what we are today; the unconditional love & never ending support 🙏#HappyMothersDay pic.twitter.com/UxP2HkwXKS
— KTR (@KTRTRS) May 12, 2019