పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సలార్ పార్ట్ 1’. ఐతే ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం. సలార్’ కథాలోచన ఇప్పటిది కాదు. దాదాపు 15 ఏళ్ల క్రితమే దీనికి బీజం పడింది. అలాగే, 2021 జనవరి 29న తెలంగాణలోని గోదావరిఖనిలో షూటింగ్ ప్రారంభమైంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం.
అదే విధంగా ఈ సినిమా రన్‌టైమ్: 2 గంటల 55 నిమిషాల 19 సెకన్లు. ఇక సినిమా బడ్జెట్ రూ.270 కోట్లు. మొత్తం 114 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువైపోయాయి. అన్నట్టు సలార్ పార్ట్ 1’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ‘ప్రతికథ’లో అంటూ సాంగే సెకండ్ సింగిల్‌ను మేకర్స్ కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు.
ఈ పాటలోని లిరిక్స్ ప్రభాస్ క్యారెక్టర్ కోసమా అనిపించేలా ఉన్నాయి. ఈ సాంగ్‌ని కృష్ణకాంత్ రాయగా రవి బస్రూర్ సంగీతంలో పలువురు చైల్డ్ సింగర్స్ పాడారు. కాగా, రేపు ఈ మూవీ విడుదల కానుంది. ఐతే, సలార్ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?. ప్రభాస్ ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కొందరైతే డార్లింగ్ బాహుబలి సినిమా కోసమే 100 కోట్లు తీసుకున్నారు కాబట్టి సలార్ కి ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంటున్నారు.
Also Read:నో డైటింగ్..బరువు తగ్గెందుకు సింపుల్ చిట్కాలు!