సూపర్.. వాట్సాప్ లో ఛానల్ క్రియేట్ చేసుకోండిలా..!

86
- Advertisement -

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ యూజర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ లో ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యాప్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా టెక్స్ట్ రూపంలో మెసేజ్ పంపాలన్న లేదా ఫోటో పంపాలన్న వాట్సప్ ఉపయోగించే షేర్ చేస్తూ ఉంటారు. ఇలా మన డైలీ యుసెజ్ లో వాట్సప్ ఎంతో ముఖ్యమైపోయింది. అయితే వాట్సప్ లో టెలిగ్రామ్ మాదిరి చానల్ క్రియేట్ చేసుకునే అవకాశం గతంలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాట్సప్ కూడా చానల్ క్రియేట్ చేసుకునే అప్డేట్ తీసుకొచ్చింది. ఈ చానల్ ద్వారా ఇంకా ఎక్కువ మందితో మన భావాలను పంచుకునే అవకాశం ఉంటుంది. మరి వాట్సప్ లో చానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామా !

ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్ళి వాట్సప్ యాప్ ను అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తరువాత యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. సాధారణంగా యాప్ ఓపెన్ చేయగానే రీసెంట్ చాట్ కనిపిస్తుంది. ఆ పక్కన స్టేటస్ అని కనిపించేది. కానీ ఇప్పుడు అప్డేట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అలా చేయగానే మొదట స్టేటస్ సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. అలాగే పాపులర్ వాట్సాప్ చానల్స్ యొక్క లిస్టు కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. చానల్స్ అని కనిపించిన చోట పక్కన ప్లస్ గుర్తు ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే క్రియేట్ ఛానల్ మరియు ఫైండ్ ఛానల్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రియేట్ ఛానల్ పై క్లిక్ చేసి కొత్తగా వాట్స్అప్ ఛానల్ ను రూపొందించుకోవచ్చు. అలాగే ఫైండ్ ఛానల్ పైన క్లిక్ చేసి మనం ఏ ఛానల్ కోసం వెతుకుతున్నామో అక్కడ కనుగొనవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ యూజర్ ను తెగ ఆకట్టుకుంటుంది.

Also Read:ఇటు మళ్లీ పెళ్లి.. అటు మళ్లీ కలుస్తోంది?

- Advertisement -