విదేశీ విమానాలను రద్దుచేయండి: మంత్రి ఈటల

313
etela
- Advertisement -

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి వచ్చే విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్‌కు విజ్ఞప్తి చేశారు మంత్రి ఈటల రాజేందర్‌ . కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై మంత్రి ఈటల అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. భేటీకి సీఎస్‌, డీజీపీ, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరోనా బాధిత దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్న ఈటల…తెలంగాణలో స్ధానికంగా కరోనా వైరస్‌ లేదదన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విదేశాల నుంచి ప్రయాణీకులను నిలువరించాలని కోరారు.

సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను నిలిపివేశామని… రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. క్వారంటైన్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను మంత్రి ఆదేశించారు.

- Advertisement -