రాజ్యసభ సభ్యులుగా సురేష్ రెడ్డి,కేకే ఏకగ్రీవం..

289
kk
- Advertisement -

తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్‌.సురేష్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు కాగా పోటీ అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది.

టీఆర్ఎస్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నికతో మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార ఏఐఏడీఎంకే నుంచి కేపీ మునుస్వామి, ఎం.తంబిదురై , డీఎంకే నుంచి త్రిచి శివ, ఎన్‌ఆర్‌ ఎలంగో, అంతియూర్‌ సెల్వరాజ్‌ ఎన్నికవగా తమిళ మనీలా కాంగ్రెస్‌ నుంచి జీకే వాసన్‌ ఎగువసభకు ఎన్నికయ్యారు.

- Advertisement -