టీచ‌ర్ ట్రాన్స్ ఫ‌ర్ అయ్యాడు…ఏడ్చేసిన విద్యార్ధులు(వీడియో)

257
bhagavanteacher
- Advertisement -

అమ్మా, నాన్న త‌ర్వాత మ‌నం ఎక్కువ‌గా గుర్తుంచుకునేది, ప్రేమించేంది విద్యాబుద్దులు నేర్పించిన ఉపాధ్యాయుల‌నే. పాఠ‌శాల‌లో ఉన్న‌ప్పుడు వారిని తిట్టిన కానీ త‌ర్వాత మాత్రం వారికి గౌర‌వ మ‌ర్యాద‌లు ఇస్తాం. మాకు చ‌దువు నేర్పిన ఉపాధ్యాయులు అని గ‌ర్వంగా చెప్పుకుంటాం. చ‌దువునేర్పిన ఉపాధ్యాయుల‌ను మాత్రం జీవితంలో మ‌ర్చిపోలేం. కాలేజిలో పాఠాలు చెప్పిన టీచ‌ర్ల‌ను మ‌ర్చిపోతామేమో కానీ స్కూల్ లో పాఠాలు చెప్పిన టీచ‌ర్లును మాత్రం అస్సులు మ‌ర్చిపోలేం. ఈసంద‌ర్భంగా గురువుల‌కు విద్యార్దుల‌కు విడ‌దీయ‌రాని బంధం ఉంటుంది.

tamilnadu teacher

అందుకే గుర‌వుల‌ను దైవంతో స‌మానంగా చూస్తుంటాం. మంచి ఉద్యోగాలు చేస్తున్నావారు అయితే త‌ప్ప‌కుండా వాళ్ల‌కు చ‌దువు నేర్పించిన ఉపాధ్యాయుల‌ను గుర్తుచేసుకుంటారు. అలా విద్యార్దుల‌తో స్నేహంగా ఉండి మంచి విద్యాబుద్దులు నేర్పిన వారిని అయితే అస్స‌లు మ‌ర్చిపోలేరు. అలాంటి ఉపాధ్యాయుడు త‌మ స్కూల్ నుంచి వెళ్లిపోతున్నాడ‌ని తెలిస్తే మ‌నకు ఎంత‌గానో బాధ‌వేస్తోంది. ఇలాంటి ఘ‌ట‌న‌నే త‌మిళనాడులో చోటుచేసుకుంది.

త‌మిళ‌నాడులోని వైగారం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో గ‌త నాలుగేండ్లుగా పాఠాలు చెప్తున్న భ‌గ‌వాన్ అనే టీచ‌ర్ ను వేరే స్కూల్ కు ట్రాన్స ఫ‌ర్ చేశారు ఉన్న‌తాధికారులు. భ‌గ‌వాన్ 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఇంగ్లీష్ ను భోదిస్తుండేవాడు. త‌మ‌తో క్లోస్ గా ఉండి చ‌క్క‌టి ఇంగ్లీష్ బోధించిన భ‌గ‌వాన్ సార్ త‌మ‌ను వ‌దిలిపొతున్నాడ‌ని తెలిసి ఉపాధ్యాయుని చుట్టు ముట్టారు విద్యార్దులు. ఓ సారి స్కూల్ కు వ‌చ్చి పిల్ల‌ల‌ను క‌లిసి వెళ్దామ‌నుకున్న భ‌గ‌వాన్ సార్ ను అడ్డుకుని ఏడ్చేశారు. మీరు ఎక్క‌డికి వెళ్లోద్దు..మీ వ‌ల్లే మేం ఇంత చ‌క్క‌గా ఇంగ్లీష్ మాట్లాడ‌గ‌లుగుతున్నాం అని విద్యార్దులు అంద‌రూ బోరున ఏడ్చేస్తోన్నారు. ఇది చూసిన మిగ‌తా ఉపాధ్యాయులంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

- Advertisement -