కాంగ్రెస్ కు షాక్.. హుజుర్ నగర్ ఉప ఎన్నికల బరిలో కోదండరాం

324
Kodanadaram
- Advertisement -

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన హుజుర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తర్వలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.

హుజుర్ నగర్ అసెంబ్లీ స్ధానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి బరిలో ఉంటారని వార్తలు వచ్చినా ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ నుంచి మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట అధిష్టానం. సీనియర్ నేత జానారెడ్డి లేదా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

అయితే ఈస్ధానం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పోటి చేయాలని భావిస్తున్నారట. ఇక టీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం 7వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు సైదిరెడ్డి. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హుజర్ నగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారనుంది. త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.

- Advertisement -