శభాష్ తైవాన్‌..కరోనా కట్టడిలో భేష్

547
tiwan corona
- Advertisement -

కరోనా దెబ్బకు ప్రపంచదేశాలు గజగజవణికిపోతున్నాయి. లక్షల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతుండగా లక్ష మందికిపైగా మృత్యువాత పడ్డారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా ప్రపంచవ్యాప్తంగా 209 దేశాలకు పైగా విస్తరించింది. కరోనాతో మెజార్టీ దేశాలు లాక్ డౌన్ చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రణ చేయడంలో తైవాన్ ఇప్పుడు ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

చైనాకు కూతవేటు దూరంలోనే ఉన్న తైవాన్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐస్‌లాండ్ అయినా తైవాన్‌ కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు భేష్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే తైవాన్ జనాభా 2.3 కోట్లు కాగా.. గతేడాది 2.7 కోట్ల మంది చైనా నుంచి తైవాన్ వెళ్లొచ్చారు. దీన్ని బట్టే ఇరుదేశాల మధ్య రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

మిలియన్ల కొద్దీ ప్రజలు చైనా నుంచి వస్తున్నప్పటికీ తైవాన్ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఏప్రిల్ 14 వరకు కేవలం 400 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయంటే తైవాన్ ఎంతలా కట్టడిచేసిందో అర్ధం చేసుకోవచ్చు.

2019 డిసెంబర్ నుంచే తమ దేశానికి వచ్చే ప్రతీ ఒక్కరికీ స్క్రీనింగ్ టెస్టులు జరిపించింది. జనవరి నెలాఖరు నుండీ వుహాన్ నుంచీ విమానాల రాకపోకల్ని రద్దు చేసేసింది. తమ దేశంలోని స్కూళ్లలో 65 లక్షల మాస్కుల్ని, 84000 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లను, 25000 థెర్మోమీటర్లను పంచింది.

తైవాన్ దేశంలో 99 శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. దీనికితోడు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ ట్రావెల్ హిస్టీరి, ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లోనే రిపోర్ట్ చేసే విధానాన్ని తైవాన్ డెవలప్ చేసింది.

కరోనా బారిన పడ్డ దేశాల నుంచి వచ్చిన వారికి అనారోగ్యం లేకపోయినా సరే… 14 రోజులపాటు వారి ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉంచారు. ఇలా చేయని వారికి, కరోనా లక్షణాల గురించి బయటకు చెప్పని వారికి భారీగా జరిమానాలు విధించారు. దీనికి ప్రజల సహకారం కూడా లభించడంతో కరోనాను తైవాన్ సమర్థవంతంగా ఎదుర్కొగలిగింది.

- Advertisement -