టైటానిక్ ఇలా మునిగిందట..

279
titanic
- Advertisement -

టైటానిక్ ఓడ మునిగిపోవడానికి గల అసలు కారణమేంటో బయటపడింది. ఇన్నిరోజులుగా సస్పెన్స్‌గా ఉన్న ఈ విషాద ఘటన అసలు రహస్యాన్ని పరిశోధనలు తెలియజేశారు. 1912లో జరిగిన టైటానిక్ ప్రమాదం వల్ల 1500 మందికి పైగా మృతి చెందారు. అప్పట్లో ఈ విషయం ఎవరికీ ఎక్కువగా తెలియకపోయిన..దానిపై వచ్చిన సినిమా ద్వారా టైటానిక్ ప్రమాదం గురించి ప్రపంచానికి తెలిసింది. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో 300 అడుగుల ఐసుగడ్డను ఢీకొట్టి, ముక్కలైందని అందరూ చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచమంతా అదే నమ్మారు. అయితే 30 ఏళ్లుగా టైటానిక్‌పై అనేక పరిశోధనలు చేసిన సెనన్‌ మెలనీ అవన్నీ కట్టుకథలని చెబుతున్నారు.

titanic

ఐర్లాండ్‌కు చెందిన పాత్రికేయుడైన మెలనీ కొత్త వాదనతో ‘టైటానిక్‌: ది న్యూ ఎవిడెన్స్‌’ అనే డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ఆయన వాదన ప్రకారం..‘నౌక భాష్పజనకం(బాయిలర్‌)లో మంటలే టైటానిక్‌ ముక్కలై మునిగిపోవడానికి ప్రధాన కారణం. బొగ్గు కారణంగా వెయ్యి డిగ్రీలకుపైగా, అదేపనిగా వెలువడిన అగ్నికీలల వల్ల నౌక మట్టు(హల్‌) బలహీనంగా మారిపోయింది. ఫలితంగా 75 శాతం బలహీనంగా, పెళుసుగా మారిపోయిన ఉక్కు.. చిన్నపాటి తాకిడికీ పగిలిపోయే స్థితికి చేరుకుంది. బెల్‌ఫాస్ట్‌ నుంచి నౌక ప్రారంభం కావడానికి ముందే అది బలహీనంగా ఉంది. నౌకను తయారుచేసిన కంపెనీ అధ్యక్షుడైన జె.బ్రూస్‌ ఇస్మేకు ఈ విషయం తెలుసు. ప్రమాదం జరిగిన తరువాత ఆయన కిమ్మనకుండా ఉన్నాడు.

titanic

మట్టు బలహీనంగా ఉన్నట్లు ప్రమాదం తరువాత తీసిన పలు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఎవరూ దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పెద్ద ఐసుగడ్డ వల్ల నౌక విరిగిపోయిందని అందర్నీ నమ్మించారు. ఇది దేవుడు చేసిన చర్య కాదు. అగ్ని, ఐసు, క్రిమినల్‌ నిర్లక్ష్యం ఫలితంగా సంభవించిన దారుణం’ అని మెలనీ వివరించారు. టైటానిక్‌పై పలు పుస్తకాలు రాసిన రిచర్డ్‌ డీ కెర్‌బ్రెక్‌ మాట్లాడుతూ మెలనీ చెప్పింది ఆమోదయోగ్యంగానే ఉందని వ్యాఖ్యానించారు.

titanic

- Advertisement -