ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం..

111
- Advertisement -

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం జరిగే ముప్పుందని గ్రహించిన పైలట్.. విమానాన్ని కిందకు దించలేదు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం.. 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించి.. అక్కడ ల్యాండ్ చేశారు.

విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదు. దీంతో 4 గంటలుగా రోజా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ప్రముఖులు విమానంలో ఉన్నారు. దీనికి సంబంధించి రోజా వీడియోను కూడా విడుదల చేశారు. డోర్లు కూడా తెరవడం లేదని, తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగళూరులో దింపారని ఆమె అందులో తెలిపారు. గ్రౌండ్ లో పరిస్థితేంటో తెలియదని చెప్పారు.

- Advertisement -