టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ 12 సంవత్సరాలకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ సందర్భంగా ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అప్పట్లో రోజు 30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే వారు. దీంతో పరిమితంగా దర్శనానికి అనుమతిచ్చారు. కానీ నేడు తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షలకు చేరడంతో 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నారు.
11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 10, 11 తేదీల్లో ఒకవేళ భక్తులకు దర్శనానికి అనుమతిస్తే కొండపై రద్దీ ఉండటంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఓ వైపు టీడీపీలో వరుస వివాదాలు వెలుగుచూస్తున్న తరుణంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.