- Advertisement -
దసరా పండుగ వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 72,195 మంది భక్తులు దర్శించుకోగా 41,071 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -