తిరుమల అప్‌డేట్..

9
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో 22 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 57,737 మంది భక్తులు దర్శించుకోగా 24,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం ద్వారా రూ 3.28 కోట్లు వచ్చిందని తెలిపారు.

హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫొన్లను మార్చి 7వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో, కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -