తిరుమల అప్‌డేట్..

43
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుండగా టోకెన్లు లేని భక్తులకు 12 కంపార్ట్‌మెంట్లలలో శ్రీవారి దర్శనానికి వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 78,158 మంది భక్తులు దర్శించుకోగా 27,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవం తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తిపారవశ్యంతో సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన వందలాది మంది దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -