- Advertisement -
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న శేషవాహనంపై అభయమిచ్చారు.
మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దృశ’నం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామల రావు దంపతులు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు అధికారులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి తదితరులు పాల్గొన్నారు.
Also Read:గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్సీ జీవన్ ఫైర్
- Advertisement -