త్రివర్ణ పతాకమే ఇక జమ్మూ కశ్మీర్ జాతీయ పతాకం..

630
national flags
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏను రద్దు చేస్తూ కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దీంతో జమ్మూ కశ్మీర్ భారత్‌లో పూర్తిగా విలీనమైంది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు జమ్మూ పౌరులు అర్హులు కానున్నారు.

భారత జాతీయ పతాకమే ఇకపై జమ్మూ కశ్మీర్‌ పతాకం కానుంది. భారతదేశంలో త్రివర్ణ పతాకంతో పాటు అధికారంగా జెండాను ఎగరవేసే హక్కు ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూకశ్మీర్ మాత్రమే. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా జాతీయ పతాకంతో పాటు కశ్మీర్ జెండాను ఎగరవేస్తారు. ఎరుపురంగులో మూడు గీతలు, ఓ నాగలితో ఈ జెండాను రూపొందించారు. ఇందులో ఎరుపు రంగును త్యాగానికి, మూడు గీతలను మూడు మతాలకు(ముస్లింలు-బౌద్ధులు-హిందువులు) ప్రతీకగా రూపొందించారు.ఇకపై జమ్మూ కశ్మీర్‌లో త్రివర్ణపతాకం మాత్రమే ఎగరనుంది.

దీంతో పాటు సుప్రీం ఆదేశాలు జమ్మూ కశ్మీర్‌లో చెల్లుబాటు కానున్నాయి. ప్రభుత్వ పథకాలకు జమ్మూ పౌరులు అర్హులు కానుండగా ద్వంద్వ పౌరసత్వం రద్దు కానుంది. పార్లమెంట్ చేసే ఏ చట్టమైన జమ్మూలో అమలు కానుంది. అంతేగాదు శాసనసభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలే ఉండనుంది. జమ్మూ కశ్మీర్‌లో భారత పతాకాన్ని,చిహ్నాన్ని అవమానిస్తే నేరం. అంతేగాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాగానే జమ్మూలో ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -