‘తిరగబడరసామీ’.. ఫస్ట్ లుక్

49
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.హీరోయిన్, రాజ్ తరుణ్ ను ఎత్తుకున్నట్లు వున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే తో పాటు రఘు బాబు, జాన్ విజయ్, పృధ్వి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read:దశాబ్ది ఉత్సవాలు..తెలంగాణ హరితోత్సవం

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్ అందిస్తున్నారు.తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి.

Also Read:వామ్మో.. ఖర్జూరాలు తింటే ఎన్ని ఉపయోగాలో.. !

- Advertisement -