సిబిల్ స్కోర్ పెరగాలంటే..ఇలా చేయండి!

19
- Advertisement -

ఒక వ్యక్తి బ్యాంకు ద్వారా గాని ఇతర ఏ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందాలంటే సిబిల్ స్కోర్ ఎంతో ముఖ్యం. దీని ఆధారంగానే లోన్స్ మంజూరు అవుతుంటాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ అప్రూవ్ కావడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే సిబిల్ స్కోర్ ను బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. అయితే ఆయా సందర్భాల్లో చేసే పొరపట్ల కారణంగా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. దాంతో కొత్తగా లోన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి. గతంలో ఏవైనా లోన్స్ తీసుకొని వాటిని తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేసిన లేదా ఈఎంఐ లను దాటవేసిన సిబిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. ఇంకా పెండింగ్ బకాయిలు పూర్తి చేసినప్పటికీ ఆ ఫైనాన్స్ సంస్థల నుంచి క్లియరెన్స్ పొందకపోయిన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. .

కాబట్టి సిబిల్ స్కోర్ ను మంచిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా సిబిల్ స్కోర్ ను 300 నుంచి 900 మద్యలో సూచిస్తారు. 300-550 మద్య ఉంటే చాలా తక్కువ, 550-650 మద్యలో ఉంటే యావరేజ్ గా ఉన్నట్లు.. 650-750 మద్యలో ఉంటే బాగుందని అర్థం. ఇంకా 750-900 మద్యలో ఉంటే అత్యుత్తమంగా ఉందని అర్థం. ఈ సిబిల్ స్కోర్ ను అత్యుత్తమంగా ఉంచుకునేందుకు లోన్స్ రూపంలో తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించాలి. అంతే కాకుండా ఏవైనా లోన్స్ కు అప్లై చేసి వాటిని మద్యలోనే విడిచి పెట్టిన సిబిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. కాబట్టి లోన్ తీసుకునే విషయంలోనూ, వాటిని తిరిగి చెల్లించే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాయిదాల రూపంలో చెల్లించే బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్ పెరుగుతుంది. తద్వారా లోన్స్ కు అప్లై చేసినప్పుడు త్వరగా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -