అల్సర్ ను ఇలా తగ్గించండి!

28
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది ఎదుర్కొనే ఉదర సంబంధిత సమస్యలలో అల్సర్ కూడా ఒకటి. మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా అల్సర్ సంభవిస్తుంది. టైమ్ కి భోజనం చేయకపోవడం, మసాలా పదార్థాలను ఎక్కువగా తినడం, ధూమపానం, మద్యపానం అల్సర్ రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అల్సర్ ప్రభావం ఎక్కువగా ఉంటే కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, అలసట, జ్వరం, బరువు తగ్గడం, రక్త హీనత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం పడడం కూడా అల్సర్ కు కరణంగానే చెప్పవచ్చు. కడుపులో పైలోరి బ్యాక్టీరియా చిన్న ప్రేగు గోడలపై దాడి దాడి చేసినప్పుడు అల్సర్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రేగుపై పుండుగా మారి క్యాన్సర్ కు కూడా దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి అల్సర్ అనేది చిన్న సమస్యగా భావించరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మన దినచర్యలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల అల్సర్ కు చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం !

టైమ్ కి భోజనం చేయడం ఎంతో ముఖ్యం ఎందుకంటే సమయాభావం లేకుండా భోజనం చేయడం ద్వారా గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ గ్యాస్ కారణంగానే అల్సర్ ఏర్పడుతుంది. ఇక చాలమందికి టి కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. రోజులో పది కంటే ఎక్కువసార్లు కూడా టి లేదా కాఫీ తాగుతుంటారు. ఇలాంటి వారు అల్సర్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల టి స్థానంలో గ్రీన్ టి లేదా తులసి రసం తాగడం అలవాటు చేసుకోవాలి.

Also Read:రాత్రి పూట తేనె తినడం మంచిదేనా?

గ్రీన్ టి కి అల్సర్ ను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇక ధూమపానం, మద్యపానం, వంటి అలవాట్లు ఉంటే మనుకోవాలి, ఇంకా పొగగు నమలడం, గుట్కా పాన్ వంటివి కూడా అల్సర్ కు కారణం అవుతాయి. కాగట్టి వీటికి దూరంగా ఉండాలి. ఇక మనం తినే ఆహారంలో కారం, మసాలా దినుసులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తినే ఆహారంలో కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి, అయితే ముల్లంగి, చింతపండు వంటివి అల్సర్ ను పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. ముఖ్యంగా రాత్రిపూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారపదార్థాలను తినడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తే అల్సర్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.

Also Read:జనసేనతో పొత్తు.. ఉన్నట్లా ? లేనట్లా ?

- Advertisement -