జలుబు కు ఇంటి వైద్యం…

283
- Advertisement -

జలుబుతో బాధపడేవారు రోజు కు రెండు సార్లు పసుపు వేసుకొని ఆవిరి పడితే జలబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. గోరు వెచ్చని పాలలో కొంచెం పసుపు వేసి తాగితే జలుబు,దగ్గుతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు.

నీళ్ళు వడపోసి,గోరు వెచ్చగా చేసుకొని ఆ నీళ్ళు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో నిమ్మరసం ,కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

Tips for Preventing Colds

మిరియాలు ,వెల్లుల్లి ,అల్లం ఇవి జలుబు తగ్గించడంలో సహాయపడతాయి.

గొంతులో గరగర ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో టీస్పూన్ ఉప్పు వేసి కరిగిన తరువాత నోటి తో పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి.

జలుబు చేసినవారు వేడి నీటితో స్నానం చేయాలి.

తులసి ,మిరియాలతో చేసిన కషాయం తీసుకుంటే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు .

పాలమీగడ,మైదాపిండి ముద్దగా చేసుకొని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత కడుక్కుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

Tips for Preventing Colds

కర్పూరం,కొబ్బరి నూనె కలిపి పాదాలరు రాస్తే పగిలిన పాదాల నుండి ఉపశమనం పొందవచ్చు.

తేనె ముఖానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే పొడి చర్మం మీద తేమ చెరిగి నిగనిగ లాడుతుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి మరొక స్పూన్ పెరుగు ముద్దగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి కొంతసేపైన తరువాత ముఖం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పైన మచ్చలు తగ్గుతాయి.

Also Read:మలబద్దకం…పరిష్కారాలు..

- Advertisement -