టీఆర్ఎస్‌లో చేరిన తిమ్మాపూర్ ఎంపీటీసీ…

141
harishrao

సిద్దిపేట జిల్లా దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి తో పాటు 100 మంది టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు…మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకున్న వ్యక్తులే ఈరోజు దుబ్బాక ఎన్నికలలో బరిలో ఉంటే వారికి ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

మల్లన్న సాగర్ నిర్మాణంపై వారి ఖాతా నుండి ప్రైవేట్ లాయర్లకు డబ్బులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు హరీశ్. కాంగ్రెస్ పార్టీ బిజెపి ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా అది నిజం కాదంటే దుబ్బాక గాంధీ వద్ద చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు మంత్రి హరీశ్‌.

తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న మాట వాస్తవమా కాదా… దుబ్బాక లో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు దుబ్బాకలో ఓట్లు ఎలా అడుగుతారు అంటూ మండిపడ్డారు.